Saturday, February 23, 2008

వీడి పోతెనేమి నేస్తం

వాడిపోలెదు స్నేహ పుష్పం'

ఎదుట లేకున్నానేమి నేస్తం

ఎదురుచూపే నిత్య కృత్యం

Thursday, February 21, 2008

నా కవిత

మనో మూలల్లో
దాగున్న మరో
మనిశిని తట్టి లేపి
చిలిపి తన్నాని
యవ్వనాన్ని
చిన్న తన్నాన్ని
అమాయకత్వాన్ని
తనువు కదిలేల నవ్వుని
మనసును కడిగేసె ధుఖాన్ని
తనలో నింపుకుంది
నీ కోసం

Wednesday, February 13, 2008

మరుజన్మలో కరుణిస్తావా!

"నారీజన" కురుల వర్ణనలో
"నరుల మెప్పు" ఆశల జడిలో
మాయ కప్పిన చీకటిలోన
దారి తెలియక పయణిస్తున్న

కాసుల గల గల రమ్మంటుంతే
కదుపు తీపికి బానిస అయ్యి
నాలుగు రోజుల "నాటకమంటు"
ప్రశంస కోసం "నటించుతున్న"

నీ "పదములై" పారనే లేదు
ఎదలో తడీ "ఆరుతున్నది"
"నీ పాట "కొలను" నింపనేలేదు
అశ చెలిమ" నిండుకున్నవి

నీకై కలము ఇంక కదలక ముందే
జీవ "సిరా" నిండుకున్నది
నా కవనయఙమవ్వకముందే
మరణమొచ్చి రమ్మంటుంది

పలుకు నేర్పిన "బాసర" తల్లి
మరుజన్మలో కరుణిస్తావా!
నీ వీణలో తంత్రిగా పుట్టే
వరమోక్కటి ప్రసదిస్తావా!

(మొన్న వసంత పంచమి మరిచానని తెలిసాక)

Tuesday, February 12, 2008

ఆమె నవ్వింది
వీడు నవ్వాడు
వాళ్ల నాన్న చూశాడు
కర్ర విరిగింది

Monday, February 11, 2008

మీరు నిద్ర పోయె ముందు
మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు
మీరు ముసుగేసుకుని ఏడుస్తున్నప్పుడు
మీరు మెట్లెక్కుతున్నప్పుడు
మీరు సినిమా హాల్లో పాట చూస్తున్నప్పుడు
మీరు రైల్వే స్టేషన్ లో ఎదురు చూస్తున్నప్పుడు

మనసు లోయల్లొ దాగున్న
మీలొని మరో మనిషినినిద్రలేపి....

అక్షారాలతో.
.నవ్వించి
కవ్వించి
పులకింపజేసి
పలరికంచి
ఏడిపించి
బ్రతికేస్తుంటాను
నేను మరణించను
నేను అక్షరాన్ని

Sunday, February 10, 2008

పున్నమి నాటి చల్లని వెన్నెలని
సాగర తీరంలో........
అమవాస్య నల్లని చీకట్లను
క్యాండిల్ లైటు డిన్నర్లో.....

నెలకో సిన్మా
పాం బీచ్ గలేరియాలో
తెలుగు సిన్మా ఆడితే
ములుందు నిర్మల్ లైఫ్ స్టైల్ లొ

గురువారల సాయాంత్రాలు
సత్సంగ్ లో...పాడి ఆడి .
..మది నిండ పెరుగుపోయిన
కల్మషాల్ని కడిగేసుకొని

శుక్రవారాల సాయంత్రాలు
"మీరింకా బయల్దెరలేదా"
"పని రాకాసుడా"
అన్న ఆహ్వానంతో..
.ఆఫిస్ నుండి సరాసరి
జుహు బీచ్ లొ తిరిగి.
.చైనీస్ రెశ్టరెంటా?
ఇండీయనా?
అని వాదులేడుకొని
ఒకరికొష్టమైందిమరోకరు చెప్పి
తాను గెలిచి
నా ఇష్టాన్ని గెలిపించి

లోకల్లో ఎప్పుడొ
ఇల్లు చేరి

శనివారం సాయంత్రాలను
డి-మాట్ లో తిరిగి
గంపెడూ సామానుతో
ఇళ్ళు చేరి......
ఆధివారపు ఉదయాల్లో......
"మరీ...ఖర్చు ఎక్కువైపోతుందండి"
కాసేపు అరుచుకొని....
మధ్యహ్నం ఇంటి పట్టున
ఓ బాపు సిన్మా చూస్తూ
....వీకెండ్ నిద్ర ముంగించి

ఆదివారాల సాయాంత్రల్లో
వచ్చే వారానికి ఇస్త్రీ బట్టలు సరి చుసి
దేవి టెంపుల్ ముందుకూర్చుని

"మా కాలేజి రోజుల్లోఅంటూ
తాను కబుర్లు చెబితే........."
మా IIT లో....అయితేనా"అని

తనను చిన్న బుచ్చి...
అలక చూసి.....
మన మద్య ఎప్పుడూఉండకూడదు
అన్న "సారి"నేమళ్ళి చెప్పి...........

"చాల్లే ..ఇక పదండీ"
ఈ రోజు వంTA మీదే...అన్న తన మాట తో

" భలే దానివే"అని అంటే"
మణులడిగానా మానిక్యాలడిగానా
ఒక్క పుట వంట చేసిపెట్త మన్నం కదా"

అని కొపం ఓలుకుతుంతే.....
పప్పూ చారువ్ ఆవకాయతింటూ......
"మా రూం లోప్రవీణ్ మామ గిట్లానే చెస్తాడు"అని
కాసేపు.. గతాన్ని నెమరు వేసుకుని
"మా హరిణి అయితే
నిన్ను చేసుకునే వాడెవడోపంట పండి నట్టె"అన్న
తన కబుర్లు వింటూ...

ఆధివారలా చీకటి పడే వేళ
కొత్త కలలు
ఇళ్ళు గురించి
కారు గురించి
సుమ్మర్ లో ట్రిప్ గురించి
..కలలు కంటు..........
కలతలేని నిద్ర లోకం చూసి


"పదండి.....మన ప్రతిభకుపదుnu
పేడదాం.....ఈ వారం మనది..."అంటూ...

క్షణాలకి జీవం పోద్దం
విన్నుత్నను వరిద్దాం
మనపై మనఏ జయిద్దం
అనుకునీ.........

.సివాలయం లో
"నా ఆఫీస్ టైం అయింది""
మధ్యాహ్నం బ్యాంక్ వాడీకి ఫోన్ చేయండి"
"సాయత్రం అత్తమ్మకి
డాక్టర్ దగ్గర అప్పైట్మెంట్ ఉంది
"మేమిద్దరం వెళ్ళొస్తాం.."

అంటూ

తాను నేను
రెండు దారుల్లో పయనిస్తూ..
..జీవితాంతం
ఒక్కట్టవుతూ........

Saturday, February 9, 2008

మళ్ళి రాని జీవితంవెళ్ళి పోనీకు
వ్యథలో